ఇక అసలైన మజా వస్తుంది: సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : రైతు సంఘం భారతీయ కిసాన్ యూనియన్.. విద్యార్థులకు మద్దతుగా 27వ తేదీన ఢిల్లీకి ర్యాలీగా వస్తున్నట్లు, నిరసనల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ, “ఇక అసలైన మజా వస్తుంది!” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ చేశారు.

అంంతేకాకుండా ఢిల్లీ వైపు సైనిక ట్యాంకులు కదులుతున్నాయంటూ సౌరవ్ దాస్ (Saurav Das) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించకపోతే శాంతియుత నిరసనకారులపై బాంబులు వేయడానికి ట్యాంకులను తరలిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. గాంధీ పుట్టిన దేశంలో స్వంత పిల్లల వంటి పౌరులపైనే సైన్యాన్ని ప్రయోగిస్తారా అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

నెటిజన్ల విమర్శలు..

అయితే, సౌరవ్ దాస్ చేసిన ఈ ఆరోపణలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ వేడుకల సన్నాహాల కోసమే సైనిక ట్యాంకులు ఢిల్లీకి వస్తున్నాయనే కనీస జ్ఞానం కూడా లేదా అని నెటిజన్లు ఆయనను నిలదీశారు. భారత సైన్యం ఎన్నడూ తన స్వంత పౌరులపై ఆయుధాలను ప్రయోగించదని స్పష్టం చేశారు. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి ఇలాంటి భ్రమలను, అబద్ధాలను సృష్టించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

దేశ రాజధానిలో ఉద్రిక్తతలు పెరుగుతుంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి “మజా వస్తుంది” అనడం ఆయన శాడిజానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న ఇలాంటి చర్యలను దేశం ఎన్నటికీ క్షమించదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>