ఐదో అంతస్తు నుంచి దూకి.. వైద్య విద్యార్థిని సూసైడ్

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం వెస్ట్ గాంధీ నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పీజీ వైద్య విద్యార్థిని దీక్షిత (26).. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య (Medical Student Suicide) చేసుకుంది. సూసైడ్ చేసుకోవడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. ఆమె సూసైడ్ కు పాల్పడడానికి గల అసలు కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దీక్షిత బెంగళూరులోని ఒక కళాశాలలో పీజీ ఆప్తాల్మాలజీ (కంటి వైద్య విద్య) ఫస్టియర్ చదువుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>