కలం, నిర్మల్: నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ నిర్మల్ (Nirmal) జిల్లాలో విజయవంతం అయ్యింది. సోన్ మండలం మాదాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ దేశ విద్యార్థులను మోసం చేసిన అతిపెద్ద కుంభకోణమని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మొహినుద్దీన్, కడ్తాల్ సర్పంచ్ గుర్రం రాము తదితరులు పాల్గొన్నారు.

