కలం,వెబ్ డెస్క్ : సోషల్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) నిరాహార దీక్ష విరమించారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉన్న ఆయనను గురువారం అర్ధరాత్రి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. అనంతరం మంత్రులిద్దరూ నిమ్మరసం ఇచ్చి, వాంగ్చుక్తో దీక్ష విరమింపజేశారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేపీ చేపట్టిన ఆందోళనకు మద్దతుగా గత నెల 28న వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. 26 రోజుల తర్వాత దీక్షను విరమించారు.

