విద్యార్థుల పోరాటానికి మీరాబాయి చాను మద్దతు!

కలం, స్పోర్ట్స్​ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న NEET-UG 2026 పేపర్ లీక్ వ్యవహారంపై భారత వెయిట్‌లిఫ్టింగ్ స్టార్, ఒలింపిక్ రజత పతక విజేత సాయిఖోమ్ మీరాబాయి చాను (Mirabai Chanu) స్పందించారు. ఢిల్లీలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు ఆమె తన పూర్తి మద్దతు తెలిపారు. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీల కోసం సిద్ధమవుతున్న మీరాబాయి చాను, ఒక ప్రకటనలో మాట్లాడారు. దేశంలో జరిగే పరిణామాలను అథ్లెట్లు గమనిస్తూనే ఉంటారని ఆమె చెప్పారు.

కఠినమైన శిక్షణ వల్ల ప్రతీ విషయాన్ని పూర్తిగా అనుసరించడం సాధ్యం కాదని అన్నారు.దేశంలో కొన్ని మంచి విషయాలతో పాటు దురదృష్టకర సంఘటనలు కూడా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనల గురించి తనకు తెలిసిందని పేర్కొన్నారు. న్యాయం కోసం విద్యార్థులు చాలా మంచి పని చేస్తున్నారని ఆమె (Mirabai Chanu) కొనియాడారు. ఆటలు పూర్తయ్యాక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

జంతర్ మంతర్ వద్ద ముమ్మరమైన నిరసనలుNEET-UG పరీక్షల లీకేజీ, ఇతర అక్రమాలపై జంతర్ మంతర్ వద్ద తీవ్రస్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యతగల చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వీరికి మద్దతు లభిస్తోంది. అభినవ్ బింద్రా స్పందనదీనికి ముందు ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తాను రాజకీయ వ్యక్తిని కాదని, కానీ కొన్ని విషయాలు అందరికీ సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. విద్యావ్యవస్థ యువతకు సరైన అవకాశాలను కల్పించాలని అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>