కలం, నిర్మల్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం సోన్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read Also: భారత్ అల్లర్లపై షర్మిష్ఠ సంచలన జోస్యం.. నెట్టింట జోరుగా చర్చ
Follow Us On: Sharechat

