కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ షాక్!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) షాక్ ఇచ్చింది. చర్చలకు రావాలని పంపిన విన్నపాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరువాతనే చర్చల అంశాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. తమ ప్రధాన డిమాండ్ నెరవేర్చేదాకా.. చర్చలకు రాబోమని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు స్పష్టంగా వివరించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

స్పష్టమైన హామీ లభిస్తేనే..

నీట్ సహా తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చంత వరకు ఆందోళనలు విరమించవద్దని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఉదయం ప్రధాని మోదీ స్పందించి పేపర్ లీక్ ఘటనలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. శాంతించకుండా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో కేంద్ర ప్రభుత్వం సైతం మల్లగుల్లాలు పడుతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read Also: కాంగ్రెస్ హయాంలో 53 లీకులు.. ఒక్క మంత్రైనా రిజైన్ చేశారా?: రాంచందర్ రావు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>