ప్రభుత్వ విప్‌‌కు మంత్రి హోదా.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విషెస్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy)కి మంత్రి హోదా లభించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. యెన్నం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి హోదా లభించడం పార్టీకి, జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఆయన నాయకత్వంలో మహబూబ్‌నగర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడిగా ఎమ్మెల్యే విశ్వాసం సంపాదించారని కొనియాడారు. మంత్రి హోదాతో మరింత విస్తృత స్థాయిలో వారు సేవలు అందిస్తారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా యెన్నం సేవలు కొనసాగాలని ‌ఆకాంక్షించారు.

Read Also: కాంగ్రెస్ హయాంలో 53 లీకులు.. ఒక్క మంత్రైనా రిజైన్ చేశారా?: రాంచందర్ రావు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>