కలం, వెబ్‌డెస్క్: దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు. కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) నాయకత్వంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలకు ఆయన తన మద్దతు తెలిపారు. దేశంలో మెరుగైన విద్యా వ్యవస్థను కోరుతూ విద్యార్థులంతా ఒక్కటై, శాంతియుతంగా తమ గొంతుకను వినిపించడం చాలా గొప్ప విషయమంటూ ఆయన అభినందించారు. ఈ ఆందోళనలో గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేపర్ లీక్ అనేది చాలా తీవ్రమైన అంశమని, ప్రభుత్వం వెంటనే విద్యార్థుల డిమాండ్లను విని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
భవిష్యత్తు తరాలు చదువుపై ఎంతో శ్రద్ధ, ధైర్యాన్ని చూపుతున్నాయని సల్మాన్ కొనియాడారు. భారతదేశం ప్రపంచానికే విద్యా కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ఈ విద్యార్థుల ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థంతో వాడుకోవద్దని కోరారు. దీని క్రెడిట్ కేవలం విద్యార్థులకే దక్కాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హృతిక్ రోషన్, దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, సోనాక్షి సిన్హా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నిలిచారు.

