పేట సింగిల్ చైర్మన్ పదవిపై చిగురిస్తున్న ఆశలు

కలం, నారాయణ పేట: నారాయణపేట సింగిల్ విండో చైర్మన్ (Single Window Chairman) పదవిపై పోటాపోటీ నెలకొంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే పదవులు ఇస్తామని ఎన్నో సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా స్వలాభం కోసం పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తే పార్టీకి భవిష్యత్తులో నష్టమవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికే సింగిల్ ను చైర్మన్ పదవిని కట్టబెట్టాలని చూస్తుంది. నారాయణపేట యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవీందర్ కే సింగిల్ విండో చైర్మన్ పదవి వస్తుందని నారాయణపేట మండల కాంగ్రెస్ నాయకులు అంచనాలు వేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారని.. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆర్థికంగా కూడా నష్టపోయాడని పోలీస్ కేసుల సైతం నమోదైన ఘటన ఉంది. డీసీసీ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డికి కుడి భుజంగా జజపూర్ గ్రామానికి చెందిన కోట్ల రవీందర్ రెడ్డి ఉన్నాడు. కోట్ల రవీందర్ కి సింగిల్ విండో చైర్మన్ ఇచ్చినట్లయితే కష్టకాలంలో పార్టీ కోసం పని చేసినందుకు సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్ నాయకులు కొంతమంది భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>