కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోబోల (Humanoid Robot) వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రంగాల్లో రోబోలు ఇప్పటికే ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సైతం మనుషులకు దీటుగా పనిచేయబోతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో నెటిజన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. వ్యవసాయం వైపు మొగ్గు చూపాలనుకునే వారికి నిజంగా షాకింగ్ న్యూస్ లాంటిదే. హ్యూమనాయిడ్ రోబోట్ పొలంలో పారతో పని చేస్తున్నట్లు ఉన్న వీడియో వైరల్‌గా మారి, 5 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఐటీ లాంటి డిజిటల్ రంగాన్ని AI ఆక్రమించినా వ్యవసాయాన్ని మానవుల నుంచి వేరు చేయడం సాధ్యం కాదని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించిన కొన్ని నెలలకే ఈ వీడియో వెలుగులోకి రావడం విశేషం.
‘మీరు వ్యవసాయంలోకి వెళ్ళండి.. సాంకేతిక ఉద్యోగాలను AI ఆక్రమిస్తోంది.. అని చెప్పినవారు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. ప్లంబింగ్, కార్పెంటరీ, వ్యవసాయం లాంటి పనులను రోబోలు చేపట్టడానికి సమయం పడుతుందని భావించామని, కానీ ఈ రోబోలు వ్యవసాయ పనులు చేస్తుండటం ఆలోజింపచేస్తుందన్నారు. అయితే ఈ వీడియో నిజమైనదేనా అనే సందేహాలను కొందరు వ్యక్తం చేశారు. “వీడియోలోని బంగాళాదుంపలు శుభ్రంగా ఉన్నాయి. రోబోట్ కదలికలు మనుషుల కంటే స్మూత్‌గా ఉన్నాయంటూ” నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. చాలామంది ‘గ్రోక్’ ను అడగ్గా.. ఇది బహుశా ఏఐతో రూపొందించిన వీడియో కావచ్చని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, భవిష్యత్తులో రోబోటిక్స్ ఎటువైపు పయనిస్తున్నాయో ఈ దృశ్యం ప్రతిబింబిస్తోందని వెల్లడించింది.
వ్యవసాయ రంగంలోకి ఏఐ రోబో ఎంట్రీ!
-రోబో పొలం పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్
-పొలంలో పార పట్టుకుని ఆలుగడ్డలు తవ్వుతున్న ఏఐ రోబో
-దీనిపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
AI Robot Digging Potatoes Goes Viral on Social Media#AIRobot #AgriTech… pic.twitter.com/utjFNCc5Gp— Kalam Daily (@kalamtelugu) July 21, 2026

