ఉస్మాన్‌సాగర్‌లో చిలుకూరు అర్చకుల వరుణ జపం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవాలని.. రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ శివారు ప్రాంతంలోని చిలుకూరు బాలాజీ (Chilkur Balaji) దేవాలయ పండితులు వరుణయాగం చేశారు. ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్ లో వరుణ జపం ఆచరించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని.. వర్షాభావ పరిస్థితులు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ (Rangarajan) నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 108 సార్లు వరుణ జప మంత్రాలను పఠించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

చిలుకూరి పండితులు రిజర్వాయర్ లో దిగి వరుణజపం నిర్వహించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అటు చిలుకూరి బాలాజీ ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి మనోవాంఛ నెరవేరాలని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>