మోదీ ఇంటి ముందు రాహుల్‌తో కేంద్రమంత్రి మంతనాలు

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ నివాసం ఎదుట నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని రాహుల్ ను కేంద్రమంత్రి ఈ సందర్భంగా కోరారు. ముఖాముఖిగా కలిసిన అనంతరం కూడా  జితేంద్ర సింగ్ రాహుల్ తో ఫోన్ ద్వారా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

కాగా, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌కు మార్చ్ చేసిన తరువాతి రోజు (మంగళవారం) కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ నేతృత్వంలో న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద నిరసన చేపట్టారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా లోక్ కళ్యాణ్ మార్క్ లోని ప్రధానమంత్రి నివాసానికి బయలుదేరారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షల లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నిరసన స్థలాన్ని సందర్శించి రాహుల్ గాంధీతో సంభాషించడం ఆసక్తికరంగా మారింది.

Read Also: బహదూర్‌గూడ భూవివాదం : రేవంత్ సర్కార్ కి భారీ ఎదురుదెబ్బ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>