‘సర్’ జూమ్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్

కలం, వలిగొండ : సర్ ప్రక్రియపై ఏఐసీసీ, టీపీసీసీ నాయకులలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam) పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ వార్ రూమ్ చైర్మన్ శశికాంత్ సెంధిల్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొని SIR ప్రక్రియపై పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సర్ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా అమలు చేయాలని నాయకత్వం సూచించింది. అలాగే ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, ప్రతి అర్హులైన ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: బహదూర్‌గూడ భూవివాదం : రేవంత్ సర్కార్ కి భారీ ఎదురుదెబ్బ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>