కలం, వెబ్ డెస్క్ : నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ నాయకులు కేంద్రంపై నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీజేపీ నిరసన ర్యాలీ సందర్భంగా జరిగిన లాఠీచార్జ్, తోపులాటలో గాయపడి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) పరామర్శించారు.
ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన (JP Nadda) స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య బృందంతో ప్రత్యేకంగా సమావేశమై బాధితుల హెల్త్ బులిటెన్‌ను సమీక్షించారు. ఈ క్రమంలోనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి రాకతో ఆసుపత్రి ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు నిరసనకారులు, విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని RML ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: సోనమ్ వాంగ్‌చుక్ ట్రీట్‌మెంట్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Follow Us On : WhatsApp

