కలం, కరీంనగర్ బ్యూరో: కాకా అభిమానుల జోలికొస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ (Vamsi Krishna) వార్నింగ్ ఇచ్చారు. కాకా అభిమానులను కొట్టాలంటే.. మొదటి దెబ్బ తనపై పడుతుందన్నారు. వారి వలనే తాను ఎంపీగా గెలిచానని.. ఎలాంటి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటనపై ఎంపీ స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు.
పోలీసులు దాడి చేశారు..
విశాఖ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకా అభిమానులు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేస్తుంటే.. పోలీసులు, ఓ వర్గం దాడి చేశారని ఎంపీ ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన వంశీకృష్ణ, ఇలాంటి వారిని వదిలిపెట్టబోమన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో కాకా అభిమానులు చాలా మంది ఉన్నారని.. వారిపై దాడులు చేసినా, కేసులు పెట్టినా సహించబోమన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.

