పాకిస్తాన్‌లో ‘సైకిల్ అంబులెన్స్’.. నెట్టింట దారుణంగా ట్రోల్స్!

కలం, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ప్రాథమిక వైద్య సేవల కోసం ‘సైకిల్ అంబులెన్స్‘ (Cycle Ambulance) సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇతర దేశాలు, నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలు డ్రోన్ ఆంబులెన్సులు, గాల్లోకి ఎగిరే ట్యాక్సీలు, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తుంటే.. పాకిస్తాన్‌ (Pakistan) మాత్రం సైకిళ్లతో విప్లవం సృష్టిస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘పాకిస్తాన్‌ ఈ అద్భుతమైన ఆవిష్కరణతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది, మానవాళికి ఈ దేశం చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

కరాచీ మేయర్ బారిస్టర్ ముర్తజా వహాబ్ ఈ మధ్యనే దీనిని ప్రారంభించారు. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేయడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. నెటిజన్లు ఎగతాళి చేసినప్పటికీ, ఈ సైకిల్ అంబులెన్స్ పథకం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, 2025 మే నెలలోనే ‘సింధ్ ఇంటెగ్రేటెడ్ ఎమర్జెన్సీ అండ్ హెల్త్ సర్వీసెస్’ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబడింది. కరాచీలోని రద్దీగా ఉండే ప్రాంతాలు, ఇరుకైన వీధుల్లోకి సాధారణ అంబులెన్సులు సమయానికి వెళ్లలేకపోవడంతో ఈ ఆలోచన చేశారు. ఈ ప్రత్యేకమైన సైకిళ్లలో ప్రథమ చికిత్స కిట్లు, ఆక్సిజన్ మాస్క్‌లు, నెబ్యులైజర్లు, బ్లడ్ షుగర్ చెకింగ్ కిట్లతో పాటు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రి ఉంటుంది.

శిక్షణ పొందిన మహిళా వాలంటీర్లు ఈ సైకిళ్లను నడుపుతున్నారు. పెద్ద అంబులెన్స్ వచ్చేవరకు బాధితులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. ఎంత నెగెటివిటీ వచ్చినప్పటికీ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇది సరైన పరిష్కారమని పలువురు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>