​అశ్వారావుపేటలో దారుణం.. బాలికకు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆపై!

కలం, ఖమ్మం బ్యూరో : ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిని ఇంటి వద్ద దింపుతానని నమ్మబలికిన నిందితుడు ఆమెను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు.

ఆ తర్వాత మార్గమధ్యలో జనసంచారం లేని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఆపై బాధితురాలిని ఆమె ఇంటి సమీపంలో విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. భయాందోళనకు గురైన బాధితురాలు ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయమంతా తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Read Also: శ్రావణంలో కమల వ్యూహం.. గురి ఎవరిపై?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>