కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ రోజు తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించబోతున్న ముఖ్యమంత్రి అభివృద్ధి పనులపై సమీక్షలు చేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం టూర్ షెడ్యూల్ విడుదల చేసింది.
మొదట వికారాబాద్ జిల్లాకు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాయంత్రం వికారాబాద్ జిల్లా హకీంపేట గ్రామానికి వెళ్తారు. అక్కడ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించనున్నారు. విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కూడిన బోధన అందించేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయో.. తనిఖీ చేస్తారు.
అనంతరం అక్కడి నుంచి కొడంగల్ (Kodangal) చేరుకుంటారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటు కొడంగల్ పట్టణం, నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ఆరా తీయనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.
సర్పై సమీక్ష..
రేపు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై కీలక సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన విధానంపై మండలాల వారీగా వివరాలు తీసుకోబోతున్నారు. సర్పై అప్రమత్తండా ఉండాలని.. అది పూర్తయ్యే వరకు ఎవరూ గాంధీ భవన్ రావొద్దని ఇప్పటికే సీఎం ఆదేశించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రే రంగంలోకి దిగి తన సొంత నియోజకవర్గంలో పరిస్థితిపై ఆరా తీయబోతున్నారు. రేపు అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయికి వెళ్లి ఆరా తీయనున్న సీఎం.. సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Read Also: శ్రావణంలో కమల వ్యూహం.. గురి ఎవరిపై?
Follow Us On : WhatsApp

