కలం, వెబ్ డెస్క్: పార్లమెంటులో ఈ రోజు ప్రధాని మోదీ (PM Modi) ఎన్డీయే ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. లోక్ సభలో ప్రవేశ పెట్టబోతున్న కీలక బిల్లులు, వాటి అవసరాల గురించి ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. అలాగే.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించబోతున్నారు. ఈ మేరకు ఎంపీలంతా పార్లమెంటులో అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.
తొలి రోజే గందరగోళం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కాగా.. తొలి రోజే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మరీ ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ, రద్దుపై తక్షణమే చర్చ చేయాలని భీష్మించుకున్నాయి. ఈ మేరకు పలువురు సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. విద్యార్థులు చనిపోతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డాయి. దీంతో, రెండు సార్లు సభ వాయిదా వేసిన స్పీకర్.. ఈ రోజుకి వాయిదా వేశారు.
Read Also: లాఠీలతో కొడుతారా?.. రాహుల్ గాంధీ ఫైర్
Follow Us On : WhatsApp

