కలం, చండూరు (చౌటుప్పల్): రక్తదానం చేయడాన్ని యువత సామాజిక బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా ముందుకు రావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) పిలుపునిచ్చారు. సోమవారం యాద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి గట్టు శ్రీరాములు గార్డెన్లో ఆయన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.
రక్తదానం చేసిన యువకులను అభినందించి, వారి సేవా భావాన్ని ప్రశంసించారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులను కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, యువత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

