నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా బి.వంశీకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన శరత్ చంద్ర జూన్ 30న ఉద్యోగ విరమణ పొందడంతో.. ఆయన స్థానంలో వంశీకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నల్లగొండ నగర ప్రగతికి పనిచేస్తానని స్పష్టం చేశారు.

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ పెడుతామన్నారు. వంశీకృష్ణకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>