కలం, నిర్మల్ : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ (Syed Haider) పాల్గొని తన గళాన్ని వినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న పేపర్ లీకేజీ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
లడఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి తమ సంఘీభావం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. యువత తమ హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

