కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో తన మాతృమూర్తి స్వర్గీయ కూచాడి సత్యమ్మ, ప్రకాశ్‌రావు గార్ల స్మారకార్థం ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రజలకు అందిస్తున్న ఉచిత కంటి వైద్య సేవలు, ఈ నెలలో సేవలు పొందిన లబ్ధిదారుల సంఖ్య, నిర్వహించిన శస్త్రచికిత్సల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గ ప్రజలు ఈ ఉచిత కంటి పరీక్ష కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకుని కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్, నాయకులు రఫీ మహమ్మద్, పూదరి అరవింద్, బాపయ్య తదితరులు పాల్గొన్నారు.

