పోలీస్ కుటుంబాలను ఆదుకుంటాం.. ఎస్పీ వినీత్ కుమార్

కలం, నారాయణ పేట: విధి నిర్వహణలో మృతిచెందిన పోలీస్ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్పీ వినీత్ కుమార్ (SP Vineeth Kumar) అన్నారు. నారాయణపేట జిల్లా డీఏఆర్‌కు చెందిన దివంగత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె. బాల నర్సింహులు ఆకస్మిక మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని ఎస్పీ పరామర్శించారు. రూ.5 లక్షల గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్నారన్నారు. అలాంటి పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం, పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>