కలం, వెబ్ డెస్క్ : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలియజేస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశం తొలిరోజున సీజేపీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా (JP Nadda) తన నివాసంలో సమావేశం అయ్యారు.
దాదాపు రెండు గంటలు వేచి చూసిన తరువాత జేపీ నడ్డాతో భేటీ అయినట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తాను, అశుతోష్ రాంకా కేంద్రమంత్రిని కలిసినట్లు తెలిపారు. ఆయనకు తమ డిమాండ్లతో కూడిన లేఖను అందజేసినట్లు వెల్లడించారు. డిమాండ్ల లేఖపై చర్చలు జరుపుతామని నడ్డా హామినిచ్చారని తెలిపారు.
కాగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సీజేపి నిరసనలు కొనసాగిస్తోంది. మరోవైపు ప్రముఖ సామాజికవేత్త సోనమ్ వాంగ్ చుక్ సైతం ఆమరనిరాహర దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశం తొలిరోజున సీజేపీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పార్లమెంట్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.
Read Also: రైతే రాజు దిశగా అడుగులు.. ఖమ్మంలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం
Follow Us On : WhatsApp

