కలం, నిర్మల్: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)కు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ (CPI ML Massline) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను (Sonam Wangchuk) బలవంతంగా అక్కడి నుంచి తరలించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బక్కన్న, గంగన్న, మహేందర్‌తో పాటు గఫూర్, వర్మ, గోరేమియా, మనోహర్, కిరణ్, లక్ష్మి, గోదావరి, లలిత, కమల, లత తదితరులు పాల్గొన్నారు.
Read Also: తిట్లు, ఓట్లు రేవంత్‌రెడ్డికి తెలిసింది ఇదే.. కేటీఆర్ ఫైర్
Follow Us On: X(Twitter)

