అమెజాన్ డేటా సెంటర్‌ మాకొద్దు బాబోయ్!

కలం, వెబ్ డెస్క్: ముంబై సమీపంలోని ఠాణే జిల్లా బాల్కుమ్ నాకా వద్ద సుమారు వెయ్యి మంది స్థానికులు భారీ నిరసనలు చేపట్టారు. నివాస సముదాయాలు, పాఠశాలలకు సమీపంలో అమెజాన్ నిర్మించతలపెట్టిన 422 మెగావాట్ల సామర్థ్యంగల డేటా సెంటర్ (Amazon Data Center) ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. జనవాసాల మధ్య ఇలాంటి ప్రాజెక్టులను నిర్మించడం సరికాదన్నారు. ఐటీ రంగానికి చెందిన ప్రత్యేక ఇండస్ట్రియల్ జోన్స్‌కు తరలించాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.

అత్యంత జనసాంద్రత కలిగిన ఈ ప్రాంతంలో ఇలాంటి డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు వల్ల నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటి, విద్యుత్ వనరులపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఉష్ణోగ్రతల పెరుగుదల, శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతోపాటు పచ్చదనానికి పేరుగాంచిన ఈ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ‘తమ నిరసన, పెట్టుబడులకు వ్యతిరేకం కాదని.. పౌరుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని’ అని వేకప్ ఠాణేకర్స్ ప్రతినిధి దయానంద్ స్పష్టం చేశారు.

డేటా సెంటర్ల గురించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు కింద కలం 360 డిగ్రీస్ ఇమేజ్ పై క్లిక్ చేయండి

Amazon Data Center
Amazon Data Center

Read Also: పార్ల‌మెంట్ స‌మావేశాల వేళ ‘రాహుల్ వీడియో’ క‌ల‌క‌లం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>