కలం, వెబ్ డెస్క్: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ (DGP Anurag Dhankar) సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం అగర్తలాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు త్రిపుర సీఎం మాణిక్ సాహా డీజీపీ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.
1994 బ్యాచ్ కు చెందిన అనురాగ్ అనురాగ్ ధన్కడ్ గతేడాది మేలో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీగా సేవలు అందించారు. ఆయన మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుడ్ టెక్నాలజీలో పీజీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్, హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం నుంచి సైబర్ క్రైమ్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.

