సీజేపీ ఆందోళ‌న‌లు.. అమిత్ షాతో ధ‌ర్మేంద్ర భేటీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: కాక్రోచ్ జ‌నతా పార్టీ పార్ల‌మెంట్ ముట్డ‌డి వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah)తో విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సీజేపీ ఆందోళ‌న‌తో పార్ల‌మెంట్ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌ నెల‌కొంది. పేప‌ర్ లీకుల‌కు బాధ్య‌త వ‌హిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేస్తోంది.

మ‌రోవైపు పార్ల‌మెంట్ లోప‌ల విప‌క్షాలు సైతం పేప‌ర్ లీకుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ స‌భ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అమిత్‌షా, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ భేటీలో ఏం చ‌ర్చిస్తారు? రాజీనామా దిశ‌గా నిర్ణ‌యం తీసుకుంటారా అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>