కలం, వెబ్ డెస్క్: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతోపాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా సీజేపీ (CJP Workers) కార్యకర్తలు గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనతో పార్లమెంట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

