కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాజేడు మండలం కడేకల్ గ్రామం దుబ్బగూడేనికి చెందిన మాడే చలపతి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు పాత కక్షలే కారణమా? ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో వాజేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

