నిజామాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్ షాక్..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌పై (Drunk Driving) పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గత మూడు వారాలలో నిర్వహించిన తనిఖీలలో 559 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరుపర్చగా, అందులో 31 మందికి కోర్టులు వారం రోజుల జైలు శిక్ష విధించాయి. మిగిలిన వారికి రూ.52.80 లక్షల జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారే ఎక్కువగా పట్టుబడుతున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. డ్రంకన్ డ్రైవ్‌పై తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Read Also: జపాన్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు.. సరికొత్త రికార్డు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>