కలం, వెబ్ డెస్క్: పోలవరం (Polavaram) జిల్లాలో విషాదం నెలకొంది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఐదుగురు మత్స్యకారులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Read Also: డబ్బున్న వాళ్లు పథకాల కోసం ఆశ పడొద్దు: సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp

