అవినీతి లేకుండా ఇళ్ల నిర్మాణం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

కలం, మిర్యాలగూడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తున్నామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) అన్నారు. మిర్యాలగూడ మండలం జాలుబాయి తండాలో నిర్మించిన నూతన ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. భూక్య కోటేష్, దీరావత్ మోహన్, భూక్య లచ్చు, భూక్య రమేష్, ఆడోత్ నాగ, భూక్య సక్కుబాయి, మాలోత్ నాగుల నూతన గృహప్రవేశాలు చేయగా.. ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఎమ్మెల్యేకి తండావాసుల ధన్యవాదాలు..

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన నివాసాన్ని అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. తమకు ఇళ్ల మంజూరు నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి తండావాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం లబ్ధిదారులు, గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారం చేశారు. తండాలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, తండా పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>