మ్యాగీ తింటే క్యాన్సర్? కాలిఫోర్నియా కీలక హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత బిజీ యుగంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో స్వయంగా వండుకోలేక నిమిషాల్లో రెడీ అయ్యే వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో చాలామంది మ్యాగీ (Maggi) తింటూ ఆకలిని తీర్చుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే పిల్లలతోపాటు పెద్దలు సైతం మ్యాగీని తినేస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల ఆకలిని తీర్చడం కోసం మ్యాగీనే పెడుతున్నారు. లంచ్ బ్యాక్సుల్లో కూడా వీటినే పెట్టేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. మ్యాగీతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. ఇండియాలో తయారయ్యే మ్యాగీపై కాలిఫోర్నియా కీలక హెచ్చరిక జారీ చేసింది.

కాలిఫోర్నియాలో అమ్మకానికి ఉంచిన ఇండియా మ్యాగీ (Maggi) నూడుల్స్ ప్యాకెట్‌పై 65 హెచ్చరిక లేబుల్ కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలతో సంబంధం ఉండొచ్చని హెచ్చరించింది. పునరుత్పత్తి సంబంధిత హాని కలిగించే అవకాశం ఉన్న రసాయనాల గురించి కూడా హెచ్చరించింది.

ఆలు, గోధుమ లాంటి ఆహారాలను ఎక్కువ ఉష్ణోగ్రతల్లో వండటం కూడా హనీ చేస్తుందని తెలిపింది. అయితే ఈ హెచ్చరిక క్యాన్సర్‌కు కారణం కావచ్చునని, వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్తలను సూచించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>