కలం, వనపర్తి: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) అన్నారు. గురువారం జిల్లాలోని మర్రికుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటుచేసిన స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ (MP Mallu Ravi) మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.1.35 కోట్ల వ్యయంతో 16 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేసిందన్నారు. తమ చిన్నతనంలో ఇలాంటి స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో లేవని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతికతను విద్యాభ్యాసంలో వినియోగించుకొని విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ కుమార్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ మహబూబ్‌నగర్ క్లస్టర్ హెడ్ ప్రవీణ్ కుమార్ ఝా, జీఐబీ స్టేట్ హెడ్ పీ. జే. శ్రావణ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ సీహెచ్ వెంకటేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Also: మహబూబ్‌నగర్‌లో వైభవంగా జగన్నాథ రథయాత్ర
Follow Us On: Instagram

