హైడ్రాకు హైకోర్ట్ షాక్.. కమిషనర్‌పై సీరియస్

కలం, వెబ్ డెస్క్: హైడ్రాపై హైకోర్ట్ (High Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హయత్ నగర్ ప్రాంతంలో కోర్ట్ స్టేటస్ కో ఉన్న ప్రాంతంలోకి హైడ్రా వెళ్లి, కూల్చివేతలు చేపట్టడంపై కమిషనర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన హైడ్రా బోర్డును వెంటనే తీసేయాలని ఆదేశించింది.

 కూల్చివేతలతో పిటిషన్ దాఖలు..

1,200 గజాల్లో ఉన్న పార్క్ స్థలం విషయమై గత 13 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఓ వ్యక్తి ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం గతంలోనే కోర్టుకు వెళ్లగా స్టేటస్ కో విధించింది. ఈ నేపథ్యంలో గురువారం హైడ్రా టీంలు ఆ ప్రాంతానికి వెళ్లి కూల్చివేతలు ప్రారంభించి.. గంటల వ్యవధిలోనే పూర్తి చేశాయి.

దీంతో, ఆ స్థలం తనదిగా క్లెయిం చేసుకుంటున్న వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్ట్ తీర్పు వెలువడకముందే, హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలు చేసినట్లు జడ్జికి వివరించారు. దీంతో హైడ్రా బోర్డ్ తీసేసి అంతకుముందు ఉన్న ఉత్తర్వులనే అమలు చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>