ఏపీలో 3 పోర్టులకు భూసేకరణ.. రెండో దశలో ఎన్ని వేల ఎకరాలంటే?

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టులను (AP Ports) త్వరితగతిన నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల రెండో దశ భూసేకరణ (Land Acquisition) కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశలో 6,248.54 ఎకరాల భూమి సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,638.52 కోట్లతో భూసేకరణకు పరిపాలనా అనుమతినిచ్చింది. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు 1,903.39 ఎకరాల భూసేకరణ చేయనుండగా.. ఇందుకోసం రూ.440.52 కోట్లు కేటాయించింది. మచిలీపట్నం పోర్టుకు 1,420.70 ఎకరాల సేకరణకుగాను రూ.347 కోట్లు వెచ్చించింది. ఇక రామాయపట్నం పోర్టుకు 2,924.45 ఎకరాల భూసేకరణ చేసేందుకు రూ.851 కోట్లు కేటాయించింది.

Read Also: సోష‌ల్ మీడియా ట్రోలింగ్స్‌.. హోం మంత్రి కీల‌క నిర్ణ‌యం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>