కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు రెండు రోజుల్లో చెల్లించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి. సురేశ్ హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికుల మూడు నెలల పెండింగ్ జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు, ఇతర సమస్యలపై గురువారం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, శాంతి ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రవీణ్, ఏఐటీయూసీ నేతలు, కాంట్రాక్ట్ కార్మికులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తున్నా కార్మికులకు మాత్రం ప్రతినెల సకాలంలో వేతనాల అందించడంలో అధికారులు, ఏజెన్సీ నిర్వాకులు వైఫల్యం చెందుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఫస్ట్ డేట్‌కే ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగా కాంట్రాక్ట్ సిబ్బందికి కార్మికులకు జీతాలు అందించాలని ఉత్తర్వులు జారీ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విచారకరమన్నారు. చర్చల్లో వేతనాలు చెల్లించాలని సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్‌కి ఆసుపత్రి సూపరిండెంట్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు బిల్లులు ఇవ్వకపోయినా ఏజెన్సీ బాధ్యతాయుతంగా రెండు నెలలు వేతనాలు కార్మికులకు అడ్వాన్సుగా జీతాలు ఇచ్చానని అంటున్నారని గుర్తుచేశారు. శనివారం వరకు కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించకపోతే సోమవారం మెరుపు సమ్మెకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బాగీ కృష్ణ యాదవ్, ఆస్పత్రి యూనియన్ బ్రాంచ్ నేతలు కార్మికులు నరసింహ, నాగరాజు, నవీన్ రాజేశ్, పేర్మల్, అబ్దుల్ అజిద్, నాగరాజు, శేఖర్, వినయ్, భాస్కర్ రెడ్డి, మోహాన్, మన్నెమ్మ, విజయలక్ష్మి, శివలీల, సుక్కమ్మ, అలివేలు, పద్మ, భార్గవి, నీరజ, స్వాతి, చెన్నమ్మ, రాధిక, లక్ష్మి నీలమ్మ, సుమతి, నాగమణి పాల్గొన్నారు.

