కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నేడు ఆమె భర్తతో కలిసి తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay)ని కలిశారు. ఈ సందర్భంగా విజయ్‌తో దిగిన ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా చివరికి తమిళనాడు ప్రజల ప్రేమ, విశ్వాసంతో విజయ్ సీఎంగా ఎన్నికయ్యారన్నారు. సీఎం పదవిని గౌరవించాలని, మాటల కంటే చేతలే గొప్పవని వరలక్ష్మి వ్యాఖ్యానించారు. విజయ్‌ని విమర్శించే వారు కొంత ఓపికతో ఆయన పని తీరును చూడాలని, విజయ్ ఏం సాధిస్తారో కొన్ని రోజులు వేచి చూడాలని సూచించారు.
తాను ఎప్పటికీ విజయ్ వెరియన్ గానే ఉంటానని పేర్కొన్న వరలక్ష్మి (Varalaxmi Sarathkumar) సర్కార్ సినిమా షూటింగ్ సమయంలో విజయ్‌తో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నారు. మహిళల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై విజయ్‌తో చర్చించినట్లు తెలిపారు. తమిళనాడు ప్రజల కోసం ఆయన నాయకత్వంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు విజయ్‌ను ఆశీర్వదించాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Read Also: హెల్దీ అనుకుంటే పొరపాటే.. చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఇవే!
Follow Us On : WhatsApp

