వనపర్తిలో ఓటరు జాబితా సవరణపై అదరపు కలెక్టర్ తనిఖీ

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) మండలంలోని చిట్యాల, చిమనగుంటపల్లి గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ (Additional Collector) (రెవెన్యూ) వినోద్ కుమార్ (Vinod Kumar) గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ డేటా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం చిన్నగుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, పూర్తి చేసిన ఫారాలను త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ఫారాల వివరాలను రోజువారీగా ఆలస్యం లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫారాలు నింపడంలో ప్రజలకు ఎదురయ్యే సందేహాలను బీఎల్‌ఓలు నివృత్తి చేసి, అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు గ్రామపంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

పాఠశాల ఆకస్మిక తనిఖీ

అనంతరం చిమనగుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలుపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వనపర్తి తహశీల్దార్ రమేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, బూత్ లెవల్ అధికారులు (BLOలు), రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>