కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పట్టణ పరిధిలోని నవభారత్ సమీపంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రతకు బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాల్వంచ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఒకే ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాల్వంచ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

