ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

కలం, నారాయణపేట: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) అన్నారు. బేటీ బచావో – బేటీ పడావో పథకంలో భాగంగా జిల్లా కేంద్రంలోని సత్యసాయి కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా శిక్షణకు వచ్చిన విద్యార్థినులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. అందరూ సెల్‌ఫోన్‌లో చాట్ జీపీటీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, ఇప్పుడు అదే వర్డ్ డాక్యుమెంట్‌ను కూడా ఇది తయారు చేసి ఇస్తుందన్నారు.

మనం ఏదైనా సమాచారం కోసం టైప్ చేసి రాయడానికి సమయం తీసుకునేలోపే, అడిగిన సమాచారాన్ని సిద్ధం చేసి అందిస్తుందన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ అంత ముందుకు వెళ్లిందని, ఈ బేసిక్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నేర్చుకోవడం కూడా అంత కష్టమేమీ కాదన్నారు. శిక్షణలో ఇవన్నీ నేర్చుకోవాలని, తర్వాతి క్లాస్‌లో మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారా? లేదా చూస్తానని ఆమె చెప్పారు. ప్రాక్టీస్ చేయడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని కూడా ఉపయోగించిన వారవుతారని ఆమె తెలిపారు.

అందరూ తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేయాలని కలెక్టర్ (Collector Priyanka) అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా చాలా వస్తున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే కాకుండా, ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా తప్పకుండా అప్లై చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యుఓ రాజేందర్ గౌడ్, వార్డు కౌన్సిలర్ కందేన్ పల్లి సత్యమ్మ, డీడబ్ల్యుఓ కార్యాలయ ఉద్యోగులు, కంప్యూటర్ శిక్షకులు పాల్గొన్నారు.

Read Also: పూరీ రథయాత్రలో తీవ్ర విషాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>