కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాల (Bonalu) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లంగర్ హౌస్ చౌరస్తాలోని గోల్కొండ (Golconda) జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రి కొండా సురేఖ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తరఫున తొలి బోనం సమర్పించారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.11 లక్షల చెక్కును ప్రభుత్వం తరఫున అందజేశారు.
గోల్కొండ బోనాల (Golconda Bonalu) వేడుకల ప్రారంభం సందర్భంగా పరిసరాలు సందడిగా మారాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మధుయాష్కి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులకు కలుగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు తెలిపారు. బోనాల వేడుకలకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈసారి గోల్కొండ, సికింద్రాబాద్‌తో పాటు చిన్న చిన్న ఆలయాలకు కూడా నిధులు అందజేసినట్లు తెలిపారు.

