కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా (AP Covid Case) కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో తాజాగా కరోనా కేసు వెలుగుచూడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. సదరు రోగిని పరీక్షించిన వైద్యులు అప్రమత్తమయ్యారు.
సదరు రోగికి ప్రాథమికి చికిత్స అందించి, అనంతరం అతన్ని హోం ఐసోలేషన్‌కు పంపించారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యలో భాగంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా కేసులు వెలుగుచూస్తుండడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ( GGH) వైద్యులు కూడా అలర్ట్ అయ్యారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు వేగవంతం చేసేందుకు వీలుగా ఆసుపత్రి వర్గాలు ఆర్టీపీసీఆర్ కిట్లు సిద్ధం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, అయితే తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also: పిఠాపురంలో దారుణం: చెల్లిని ఏడిపించొద్దన్నందుకు అన్న హత్య!
Follow Us On: Sharechat

