కలం, జోగులాంబ గద్వాల: ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ (SC Welfare Hostels) ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హాస్టల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హ విద్యార్థికి సీటు కేటాయించేలా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్సీ సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నుషితకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి విద్యా సంవత్సరం హాస్టల్ సీట్ల కొరత కారణంగా పేద, గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు హాలీంపాష, యూఎస్ ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్ పల్లి రంగస్వామి, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి హరీశ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాన్ పాల్గొన్నారు.

