ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు.. నారాయణపేట కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులు సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని నారాయణపేట (Narayanpet) కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. కొస్గి మండలం మల్లారెడ్డిపల్లి రైతు వేదికలో కలెక్టర్ బుధవారం పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా “ప్రాజెక్ట్ కె-100″కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్న మల్చింగ్ విధానంలో వంకాయ, పచ్చిమిర్చి సాగు, స్టేకింగ్ విధానంలో టమాట, పూల సాగు (ఫ్లోరికల్చర్)ను ప్రత్యక్షంగా పరిశీలించారు.

రైతులు అవలంబిస్తున్న ఆధునిక సాగు విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పంటల నిర్వహణ తీరు పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. వినూత్న వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగుతున్న రైతులను అభినందించారు. అనంతరం ఎల్‌నినో పరిస్థితులలో కరువును తట్టుకునే రకాలు, స్వల్పకాలిక రకాలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్‌తో పాటు వార్ల విజయ్ కుమార్ గ్రంథాలయ చైర్మన్, రఘువర్ధన్ రెడ్డి ఏడీఏ రామ కృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్, హార్టికల్చర్ అధికారి హర్ష వర్ధన్ రెడ్డి, కొస్గి డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు రేష్మరెడ్డి, రమేశ్, ప్రవీణ్ కుమార్ , వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

ఉన్నత చదువులు చదివి ఉత్తమంగా రాణించాలి

ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు సదుపాయాలతో ఉన్నత చదువులు చదివి ఉత్తమంగా రాణించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. బుధవారం కోసిగి మండలం నాచారం కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి విద్యార్థినులకు యూనిఫార్మ్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో వసతులు మెరుగ్గా ఉన్నాయా లేదా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం ఇస్తున్నారా అని అడిగారు. కలెక్టర్ వెంట లైబ్రరీ చైర్మన్ వర్ల విజయ్ కుమార్, రఘువర్ధన్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకట్ రాములు, డీఈవో గోవిందరాజులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, సర్పంచ్ రేణుక, ఉపసర్పంచ్ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు రఘువర్ధన్ రెడ్డి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>