పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో అవి వాడొద్దు.. ఎంపీల‌కు కొత్త రూల్స్!

క‌లం, వెబ్ డెస్క్‌: జూలై 20 నుంచి పార్ల‌మెంట్ (Parliament) వ‌ర్షాకాల‌ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఎంపీల‌కు స‌రికొత్త నిబంధ‌న‌లు విధిస్తూ లోక్‌స‌భ (Lok Sabha) స‌చివాల‌యం ఓ బులిటెన్ విడుద‌ల చేసింది. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రత, సభ్యుల గోప్యతకు భంగం కలిగించే విధంగా స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గ్లాసెస్, పెన్ కెమెరాలు వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవద్దని ఎంపీలకు సూచించింది.

పార్ల‌మెంట్ వ‌ర్షా కాల‌ స‌మావేశాలు ఈ నెల 20న ప్రారంభ‌మై ఆగస్టు 13 వరకు జర‌గ‌నున్నాయి. స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గ్లాసెస్, పెన్ కెమెరాల వంటి ఆధునిక పరికరాల్లో కొన్ని సభ్యుల గోప్యతకు భంగం కలిగించడంతో పాటు, పార్లమెంటరీ ప్రత్యేక హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తున్నాయ‌ని లోక్‌సభ సచివాలయం పేర్కొంది. పార్లమెంట్ ఎస్టేట్‌లో ఎంపీలు ఈ పరికరాలను వినియోగించకూడ‌ద‌ని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>