సీసీఐని పున‌రుద్ధ‌రించే వ‌ర‌కు పోరాడ‌తాం: కేటీఆర్

క‌లం, వెబ్ డెస్క్‌: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పరిశ్రమను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిశారు. రైతులు, సీసీఐ సాధన సమితి ప్రతినిధుల బృందంతో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్లాంట్‌ను పునరుద్ధరిస్తామని 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఎంతో విలువైన ఈ ప్రభుత్వ ఆస్తిని వృథాగా వదిలేసి స్క్రాప్‌గా మార్చకుండా, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దాదాపు 2,300 ఎకరాల్లో విస్తరించి 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణకు సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడి అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.250 కోట్లను వయబిలిటీ సపోర్ట్‌గా అందిస్తే ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించవచ్చన్నారు. దీనివల్ల దాదాపు 6,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన తరహాలోనే ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమకు కూడా తగిన మద్దతు ఇవ్వాలని కోరారు. ప్లాంట్ పున‌రుద్ధ‌రించే వరకు బీఆర్‌ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>